ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపటి నుంచి పెనుగంచిప్రోలు తిరుపతమ్మ మండల దీక్షలు - Penuganchipolu Tirupatamma Mandal dhiksha started news

రేపటి నుంచి పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి మండల దీక్ష, మాలాధారణ కార్యక్రమం ప్రారంభం కానుంది. అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏడాది సుమారు 30 వేల మంది దీక్షలు తీసుకుంటుండగా.. కరోనా ప్రభావంతో ఈ ఏడాది పిల్లలకు, వృద్దులకు మాలాధారణకు అనుమతి లేదని అధికారులు వెల్లడించారు.

Penuganchipolu Tirupatamma Mandal dhiksha
రేపటి నుంచి పెనుగంచిపోలు తిరుపతమ్మ మండల దీక్షలు

By

Published : Jan 7, 2021, 12:34 PM IST

తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మవారి మండల దీక్ష మాలాధారణ కార్యక్రమం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. తెల్లవారుజామున ఐదు గంటలకు దీక్ష దారులకు ఆలయంలో మాలలు వేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. వారం రోజుల పాటు కార్యక్రమం నిర్వహించనున్నారు. మండల దీక్షలు తీసుకున్న భక్తులు 45 రోజులపాటు నిష్ఠతో దీక్షలు పూర్తిచేసి.. తిరిగి ఇరుముడులు సమర్పించనున్నారు.

అదే రోజే అమ్మవారికి నిర్వహించే కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. ఈ ఏడాది కొవిడ్ కారణంగా ఆలయం వద్ద పటిష్టమైన నిబంధనలు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పదేళ్ల లోపు చిన్నారులకు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు ఆలయంలోకి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈసారి వారు మాలలు వేసుకునేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details