ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగ్గయ్యపేటలో రైతు దినోత్సవం.. పింఛన్ల పంపిణీ ప్రారంభం - రైతు దినోత్సవ సభ

దివంగత వైఎస్​ఆర్ జయంతి సందర్భంగా జగ్గయ్యపేట మార్కెట్ యార్డులో రైతు దినోత్సవం నిర్వహించారు. పెంచిన పింఛన్లు, కౌలు రైతు కార్డులు పంపిణీ చేశారు.

pension distrubution at jaggayyapeta market yard

By

Published : Jul 8, 2019, 2:31 PM IST

రైతు దినోత్సవ సభలో పింఛన్ల పంపిణీ ప్రారంభం..

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మార్కెట్ యార్డులో చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ప్రారంభించారు. వైఎస్​ఆర్ జయంతి సందర్భంగా ప్రత్యేకాధికారి రవీంద్ర, తహసీల్దార్ సతీష్ ఆధ్వర్యంలో జరిగిన రైతు దినోత్సవ సభలో మాట్లాడారు. నవరత్నాల హామీల అమలు... ప్రజల జీవితాలను మారుస్తుందని, ప్రజా సంక్షేమంలో ముఖ్యమంత్రి జగన్ ముందు ఉన్నారని అన్నారు. ఆదర్శ రైతులను సత్కరించి కౌలు రైతు కార్డులు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details