రాష్ట్రంలో పింఛను లబ్ధిదారుల సంఖ్య పెరిగిందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. సెప్టెంబరులో కొత్తగా 90,167 మందికి పింఛను ఇస్తున్నట్లు వెల్లడించారు. కొత్త పింఛనుదారుల కోసం మరో 21.36 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 61.68 లక్షల మంది పింఛను లబ్ధిదారులు ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. కరోనా దృష్ట్యా లబ్ధిదారుల బయోమెట్రిక్ బదులు జియో ట్యాగింగ్ ఫోటోలు తీసుకుంటున్నట్లు వివరించారు.
కొత్తగా 90,167 మందికి పింఛను: మంత్రి పెద్దిరెడ్డి - pensions distribution in ap news
సెప్టెంబర్ నెలలో కొత్తగా 90,167 మందికి పింఛను ఇస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. వీరితో కలిపి రాష్ట్రంలో మొత్తం 61.68 లక్షల మంది పింఛను లబ్ధిదారులు ఉన్నారని పేర్కొన్నారు.
peddireddy ramachandra reddy