రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యాసంస్థలను తక్షణమే ప్రభుత్వపరం చేయాలని ప్రగతిశీల విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విధానాలతో విద్యా వ్యవస్థ ప్రమాణాలు దిగజారుతున్నాయని, ఖాళీలను భర్తీ చేయకపోవడం, ఒప్పంద ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయడం లేదని రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఎయిడెడ్ విద్యా సంస్థలను వెంటనే ప్రభుత్వపరం చేయాలి' - vijayawada latest news
విజయవాడలో ప్రగతిశీల విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యాసంస్థలను వెంటనే ప్రభుత్వపరం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర డిమాండ్ చేశారు. పార్ట్ టైం ఉపాధ్యాయులకు పూర్తి స్థాయి వేతనాలు చెల్లించకుండా, నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సహాయంతో.. 5,567 పోస్టులకు నిధులు మంజూరవుతన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 1,300 మంది రెగ్యులర్ అధ్యాపకులకు మాత్రమే పూర్తి వేతనాలు చెల్లిస్తుందని రవిచంద్ర అన్నారు. పార్ట్ టైం అధ్యాపకులకు పూర్తిస్థాయి వేతనాలు అమలు చేయకుండా, నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ బోధనా ఫీజులు, ఉపకారవేతనాలు మంజూరు కాకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు సైతం పూర్తి ఫీజు చెల్లించి చదువుకునే పరిస్థితి ఏర్పడిందని ఆక్షేపించారు.
ఇదీచదవండి.