ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్రంలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది' - PCC Working President Tulsi Reddy latest comments

19 నెలలుగా అసమర్థ పాలన చేస్తూ ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి విమర్శించారు. వెంటనే జగన్​ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా నందిగామ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు.

PCC Working President Tulsi Reddy
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి

By

Published : Jan 6, 2021, 4:20 PM IST

కృష్ణా జిల్లా నందిగామ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రాన్ని పేకాట రాయుళ్లు పరిపాలిస్తున్నారని అన్నారు. గుడివాడ నియోజకవర్గంలో మంత్రి కొడాలి నాని ఏ విధంగా పేకాట ఆడిస్తున్నారో.. పలు ప్రాంతాల్లోనూ అదే జరుగుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో పేకాట కొనసాగుతోందని ఆరోపించారు. తను కూడా పులివెందులకు చెందిన వాడిని కాబట్టి ఆ విషయం తనకు తెలుసన్నారు.

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి

రాష్ట్రంలో శాంతిభద్రతలకు పూర్తిగా విఘాతం కలుగుతోందని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని దుయ్యబట్టారు.. రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాల పై వరుసగా దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి ఏ మాత్రం స్పందించి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. దీన్ని బట్టి చూస్తే ముఖ్యమంత్రి ఏ విధంగా వ్యవహరిస్తున్నారో స్పష్టం అవుతుందని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details