ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నల్లబెలూన్ల ఎగురవేత కేసు.. పోలీసుల ఎదుట లొంగిపోయిన రాజీవ్ రతన్ - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

SURRENDER: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ గన్నవరం పోలీస్ స్టేషన్​లో లొంగిపోయారు. ఇవాళ పార్టీ పెద్దలతో కలిసి స్టేషన్​కు వచ్చిన రాజీవ్.. పోలీసులకు లొంగిపోయారు. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ.. రాజీవ్‌ రతన్‌ బెలూన్లు ఎగరవేసిన సంగతి తెలిసిందే...

SURRENDER
పోలీసులకు లొంగిపోయిన కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్

By

Published : Jul 7, 2022, 12:54 PM IST

SURRENDER:ప్రధాని పర్యటన రోజుగన్నవరం విమానాశ్రయ పరిసరాల్లో నల్లబెలూన్లను ఎగురవేసిన కేసులో తప్పించుకు తిరుగుతున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ గన్నవరం పోలీస్ స్టేషన్​లో లొంగిపోయారు. పరారైన రాజీవ్ రతన్ కోసం పోలీసు బలగాలు మూడు రోజులుగా గాలిస్తున్నారు. ఎట్టకేలకు ఇవాళ పార్టీ పెద్దలతో కలిసి స్టేషన్​కు వచ్చిన రాజీవ్.. పోలీసుల ఎదుట లొంగిపోయారు.

పోలీసుల ఎదుట లొంగిపోయిన కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్

ఇదీ జరిగింది.. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ.. గన్నవరం విమానాశ్రయ పరిసరాల్లో నల్లబెలూన్లను ఎగురవేసి.. కాంగ్రెస్‌ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ రతన్‌ బెలూన్లు ఎగరవేసినట్లు గుర్తించిన పోలీసులు.. అతనిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details