కృష్ణా జిల్లా డోకిపర్రు శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం భవిష్యత్తులో మరింత ప్రసిద్ధి చెందాలని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు..మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఎండీ పి.వి కృష్ణారెడ్డి, ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్ పిచ్చిరెడ్డి స్వాగతం పలికారు.
బ్రహ్మోత్సవాలలో కళ్యాణోత్సవానికి రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పవన్ అన్నారు. నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. మేఘా ఇంజినీరింగ్ సంస్థ వారు సీఎస్ఆర్ కింద గ్రామంలో సమకూర్చిన సౌకర్యాలపై పవన్ హర్షం వ్యక్తం చేశారు. నిరంతర గ్యాస్ సరఫరా ఎంతో ఆకట్టుకుందని తెలిపారు. పూజలు చేసిన అనంతరం..వేద పండితులు పవన్‌కు స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు.