Pawan Kalyan Speech at Machilipatnam: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఒకరికొకరు సహకరించుకోవలసిన అవసరం: పవన్ కల్యాణ్ Pawan Kalyan Speech at Machilipatnam: వారాహి యాత్రలో (Varahi Yatra) భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. మచిలీపట్నం తనను ఎంతగానో ప్రభావితం చేసిన నేల అని చెప్పారు. పింగళి వెంకయ్య, రఘుపతి వెంకటరత్నంనాయుడు పుట్టిన నేల అని.. మచిలీపట్నానికి చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యం ఉందని పవన్ వ్యాఖ్యానించారు.
పింగళి వెంకయ్య (Pingali Venkayya) ఆకలితో చనిపోవడం బాధాకరమన్నారు. కులాల ఐక్యత గురించి తాను పదే పదే చెబుతానని.. ఏ ఒక్క కులం వలనో ఆధికారం రాదని గుర్తించాలని పేర్కొన్నారు. జనసేన విశాలభావం ఉన్న పార్టీ.. ఇది ప్రాంతీయపార్టీ కాదన్న పవన్ మున్ముందు జనసేన భావజాలమే దేశమంతా వ్యాపిస్తుందని తెలిపారు.
Pawan Kalyan Mouna Deeksha: విద్వేష రాజకీయాలతో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం.. దోపిడీ, అవినీతికి అడ్డుకట్ట వేయాలి : పవన్
Pawan kalyan on Caste: కులాలను వెదుక్కుని స్నేహాలు చేయను: కుల సమీకరణాల గురించి ఆలోచిస్తే ఎప్పటికీ అభివృద్ధి సాధ్యం కాదని.. దుబాయ్ వంటి చోట్ల మూడింట రెండొంతులు భారతీయులే ఉంటారని చెప్పారు. కాపులు అత్యధిక సంఖ్యలో ఉన్నారని.. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని వ్యాఖ్యానించారు. కాపు కులంలో పుట్టినా.. తాను అన్ని కులాలను సమదృష్టితో చూసే వ్యక్తినని.. తనను కుల నాయకుడిని ఎందుకు చేస్తారని ప్రశ్నిస్తున్నానన్నారు. తాను కులాలను వెదుక్కుని స్నేహాలు చేయనని.. వైసీపీ కీలక పదవులన్నీ ఒక కులంతో నింపేస్తే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
Pawan about NTR: ఒక్క ఎన్టీఆర్‌కే సాధ్యమైంది:ఒక కులానికి మరో కులం పట్ల ఎందుకు ద్వేషం ఉండాలని అన్నారు. సామాజిక వెనుకబాటును ఎలా రూపుమాపాలా అని ఆలోచించాలని.. నాలుగు ఎన్నికల్లో కష్టపడితే బీఎస్పీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. లేచిందే లేడికి పరుగు అన్నట్టు.. పార్టీ పెట్టగానే అధికారం రాదని తెలిపారు. పార్టీ పెట్టగానే అధికారం అందుకోవడం ఒక్క ఎన్టీఆర్‌కే సాధ్యమైందని కొనియాడారు.
Pawan Kalyan Varahi Yatra: జగన్ వేల కోట్ల అవినీతి గురించి ప్రధానికి తెలియదా?: పవన్ కల్యాణ్
Pawan comments on CM Jagan: జగన్‌ను చిన్నప్పటి నుంచీ చూస్తున్నా: రాజధాని అమరావతికి 30 వేల ఎకరాలు అన్నప్పుడు ఆరోజు తాను విభేదించానని తెలిపిన పవన్.. రాజధాని అనేది రాత్రికి రాత్రి అభివృద్ధి కాదని అన్నారు. జగన్‌ను (CM YS Jagan) చిన్నప్పటి నుంచీ చూస్తున్నానని.. రాష్ట్రానికి జగన్ సరైన వ్యక్తి కాదని ఆనాడే అనుకున్నానని పేర్కొన్నారు. లోతైన దృష్టితోనే రాజకీయాలను చూడాలని సూచించారు. అందరితో కలిసి నడిస్తేనే మనం ముందుకెళ్లగలమని అన్నారు.
Pawan about Janasena Party: మాట ఇచ్చి వెనక్కి వెళ్లే ఉద్దేశం లేదు: తాను సనాతన ధర్మాన్ని బలంగా నమ్ముతానని.. సనాతన ధర్మం అన్ని మతాలనూ గౌరవిస్తోందన్నారు. నైతిక బలం ఉంటే ఎవరిపైనైనా పోరాటం చేయగలమన్న పవన్.. వెన్నుపోటు పొడిచేవాడు ఎప్పుడూ మనలోనే ఉంటాడని.. బయట ఉండడని తెలిపారు. మాట ఇచ్చి వెనక్కి వెళ్లే ఉద్దేశం లేదు కనుకే జనసేన పెట్టానని పవన్ చెప్పారు. పార్టీ స్థాపించాక మనం రోజురోజుకూ ఎదుగుతున్నారు. రాజకీయాల్లో మొండితనం ఉండాలని అన్నారు.
Janasena chief Pawan Kalyan comments: జగన్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న అధికారులు సిగ్గుపడాలి: పవన్ కల్యాణ్
"ఆరోజు మరి వైసీపీకి మద్దతు ఇచ్చి ఉండచ్చు కదా అంటే.. నాకు వైసీపీపై వ్యక్తిగతంగా ఎప్పుడూ ద్వేషం లేదు. నేను జగన్ అనే వ్యక్తిని చినప్పటి నుంచి చూశాను. అతనికి నేను ఎవరో తెలియక పోవచ్చు.. కానీ నాకు 19 -20 సంవత్సరాలు ఉన్నప్పుడు నుంచీ నేను అతనిని చూస్తున్నాను. అతనిది, అతని స్నేహితులు దూకుడు స్వభావంతో దాడి చేసే వారు. 18-20 సంవత్సరాలలోనే ఒక ఎస్సైని జైలు లాకర్లో వేసి పెట్టిన మనిషి అతను. అందరూ కూడా ఏ పార్టీ గెలుస్తుందో దాని వైపు వెళ్లిపోతుంటారు. కానీ నేను మాత్రం రాష్ట్రానికి సరైన నిర్ణయం తీసుకుంటాను. ఒకానొక సమయంలో నేను టీడీపీతో కూడా విభేదించాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఒకరికొకరు సహకరించుకోవలసిన అవసరం. ఇందులో భాగంగా వైసీపీ కాకుండా ఎవరు వచ్చినా స్వాగతిస్తాం". - పవన్ కల్యాణ్, జనసేన అధినేత
Pawan Announced TDP Janasena Alliance : వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసే పోటీ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్