ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Pawan Kalyan Sensational Comments: జగన్​ ఏపీకి బంగారు భవిష్యత్తు కాదు.. విపత్తు: పవన్ కల్యాణ్‌ - పవన్ ఆరోపణలు

Pawan Kalyan Sensational Comments: జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల అనంతరం జనసేన - టీడీపీ ప్రభుత్వం రాబోతోందని.. పవన్ ధీమా వ్యక్తం చేశారు. వారాహి యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన భహిరంగ సభలో ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు.

Pawan Kalyan Sensational Comments
Pawan Kalyan Sensational Comments

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 4, 2023, 7:33 PM IST

Updated : Oct 5, 2023, 6:23 AM IST

Pawan Kalyan Sensational Comments: జగన్​ ఏపీకి బంగారు భవిష్యత్తు కాదు.. విపత్తు: పవన్ కల్యాణ్‌

Pawan Kalyan Sensational Comments:జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వం అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ విమర్శలు గుప్పించారు. కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన వారాహి యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల తర్వాత జనసేన - టీడీపీ ప్రభుత్వం రాబోతుందని.. రాష్ట్ర ప్రయోజనాల వద్దకు వచ్చేసరికి మనమంతా ఒక్కటి కావాలని పవన్ పిలుపునిచ్చారు. మనలో విభేదాలు పాలసీల వరకే పరిమితం చేసుకోవాలని టీడీపీ, జనసేన శ్రేణులకు సూచించారు. ఓట్లు వేయించుకునేందుకే వైసీపీ పథకాలను ప్రవేశపెడుతుందని.. వాటి అమలు వరకు వచ్చేసరికి వైసీపీ పథకాల్లో అంతా డొల్లతనం కనిపిస్తుందని పవన్‌ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం.. ఉపాధి కూలీల పొట్ట కొట్టిందని పవన్‌ ఆరోపించారు. సగానికి సగం ఉపాధిహామీ నిధులు దారి మళ్లించారనీ.. నిధుల మళ్లింపులో రాష్ట్రానిదే అగ్రస్థానమని కేంద్రం చెప్పింది పవన్‌ పేర్కొన్నారు.

మెగా డీఎస్‌సీ: రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిపై పలు రకాల కేసులు పెడుతున్నారని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులకు భయపడేవారు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారని పవన్ ప్రశ్నించారు. హత్యలు చేసేవారికి, చేయించేవారికి జేజేలు కొడుతున్నారని.. అతిఎక్కువ దేశద్రోహం కేసులు ఏపీలోనే నమోదయ్యాయని పవన్‌ వెల్లడించారు. ఏపీ ప్రజలు గర్వంగా తలెత్తుకుని బతకాలనేదే తన ఆశయమని పవన్‌ వెల్లడించారు. తనకు పదవులపై ఆశ ఉంటే 2009లోనే పదవిలో ఉండేవాడిని.. పవన్‌ పేర్కొన్నారు. లక్షలమంది యువత మెగా డీఎస్‌సీ వేయాలని కోరుతున్నారని.. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే యువత ఎందుకు మా సభలకు వస్తారని పవన్‌ ప్రశ్నించారు. పెడనలో ఏ పని చేయాలన్నా ఇక్కడి ఎమ్మెల్యేకు ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని పవన్‌ విమర్శించారు. పాస్‌బుక్ కావాలంటే రూ.10 వేలు లంచం అడుగుతున్నారని.. రొయ్యల చెరువులో ట్రాన్స్‌ఫామ్‌ కావాలంటే లంచం ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మడఅడవులను కూడా ఆక్రమించి రొయ్యల చెరువులు వేశారని విమర్శలు గుప్పించారు.

ఫ్లెక్సీలను నిషేధించారు: 28 లక్షల ఇళ్లు కడతామని చెప్పి 3 లక్షల ఇళ్లే కట్టారని పవన్‌ కల్యాణ్‌ విమర్శలు గుప్పించారు. ఇళ్ల పేరుతో రూ.4 వేల కోట్లు దోచేశారని నివేదికలు చెబుతున్నాయని పవన్‌ పేర్కొన్నారు. తన సినిమాలు, పుట్టినరోజు వచ్చినప్పుడే.. వైసీపీ నేతలకు ప్లాస్టిక్‌పై నిషేధం గుర్తుకు వస్తుందని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాస్టిక్‌పై నిషేధం పేరుతో తమ ఫ్లెక్సీలను నిషేధించారని ఆరోపించారు. జగనన్న.. ఏపీకి బంగారు భవిష్యత్తు కాదు.. ఆయనో విపత్తు. అంటూ పవన్‌ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం కుల రాజకీయాలు చేస్తుందని పవన్ ఆరోపించారు. తాను ప్రజలను కులాలుగా విడదీసి రాజకీయాలు చేయనని పవన్‌ పేర్కొన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలందరినీ సమానంగా చూస్తానని వెల్లడించారు. రాష్ట్ర యువత కూడా కులాలకు అతీతంగా ఆలోచించాలని తెలిపారు. ప్రతిపక్ష నేతలను ఆయా కులాల వారితో తిట్టించడం జగన్ నైజం అంటూ ఎద్దేవా చేశారు. ఏ నేతను ఆ కులానికి చెందిన నేతలతో తిట్టిస్తారని పవన్‌ విమర్శించారు.

Last Updated : Oct 5, 2023, 6:23 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details