ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హారతులు పట్టి.. పవన్​కు మహిళల స్వాగతం - కృష్ణా జిల్లా రైతులపై వరదల ప్రభావం

కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ పర్యటిస్తున్నారు. నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను పవన్​ పరామర్శిస్తున్నారు. రైతన్నలు తమ కష్టాలను విన్నవిస్తున్నారు.

pawan kalyan krishna district tour
కృష్ణా జిల్లాలో పవన్​ పర్యటన

By

Published : Dec 28, 2020, 12:51 PM IST

Updated : Dec 28, 2020, 1:24 PM IST

కృష్ణా జిల్లాలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పర్యటన కొనసాగుతోంది. కంకిపాడు - గుడివాడ రహదారి మీదుగా పవన్‌కల్యాణ్‌ ర్యాలీ జరిగింది. మార్గమధ్యలో రైతులను కలుస్తూ సమస్యలు తెలుసుకుంటున్నారు. తుపాను వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించారు. అంగులూరులో పొలాల్లో దిగి నష్టపోయిన రైతుల కష్టాలు పవన్​ కల్యాణ్ విన్నారు.

నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం పెంచాలని పవన్ డిమాండ్ చేస్తున్నారు. పంటనష్టం పరిహారం పెంచాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్​కు వినతిపత్రం ఇవ్వనున్నారు. నందమూరు క్రాస్ రోడ్డు వద్ద మహిళలు పవన్‌కు హారతులు పట్టారు. రైతన్నలు తమ కష్టాలను పవన్ ‌కు వివరించారు. పంటనష్టానికి పరిహారం పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరారు.

Last Updated : Dec 28, 2020, 1:24 PM IST

ABOUT THE AUTHOR

...view details