ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుడివాడలో పవన్ వార్నింగ్...దురుసుగా మాట్లాడితే సహించం - pawan kalyan krishna district tour updates

రాష్ట్రంలో రైతులందరికీ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ అన్నారు. నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తూ పవన్​ కల్యాణ్​ కృష్ణా జిల్లా పర్యటన చేపట్టారు.

pawan kalyan krihsna district tour
pawan kalyan krihsna district tour

By

Published : Dec 28, 2020, 1:28 PM IST

Updated : Dec 28, 2020, 8:58 PM IST

గుడివాడలో పవన్​ కల్యాణ్​ రోడ్​ షో

కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రోడ్​ షో నిర్వహించారు. నెహ్రూ చౌక్ సెంటర్​లో నిర్వహించిన బహిరంగ సభలో పవన్‌ ప్రసంగించారు. గుడివాడకు వచ్చే రోడ్లు అధ్వానంగా ఉన్నాయని.. రోడ్లు నిర్మించాలని స్థానిక ప్రజాప్రతినిధిని ప్రజలు ప్రశ్నించాలని సూచించారు. వైకాపా నేతలకు పేకాట క్లబ్బుల నిర్వహణలో ఉన్న సమర్థత పాలనలో లేదని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులందరికీ న్యాయం జరిగే వరకు ఎంత దూరమైనా వెళ్తానని పవన్‌ అన్నారు. నోటి దురుసుగా మాట్లాడే వైకాపా నేతలను జనసేన బలంగా ఎదుర్కొంటుందన్నారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించమన్నారు.

నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తూ పవన్​ కల్యాణ్​ కృష్ణా జిల్లా పర్యటన చేపట్టారు. కంకిపాడు-గుడివాడ రహదారి మీదుగా పవన్‌కల్యాణ్‌ ర్యాలీ చేపట్టారు. నివర్ తుపాను, ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు హేతుబద్ధమైన పరిహారం ఇవ్వాలని కోరుతూ మచిలీపట్నంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్​కు పవన్ కల్యాణ్ వినతిపత్రం అందించనున్నారు.

ఇదీ చదవండి: హారతులు పట్టి.. పవన్​కు మహిళల స్వాగతం

Last Updated : Dec 28, 2020, 8:58 PM IST

ABOUT THE AUTHOR

...view details