జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్ ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. నివర్ తుపాను కారణంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. అనంతరం రైతులను కలిసి మాట్లాడతారు. జిల్లాలోని ఉయ్యూరు, పామర్రు, అవనిగడ్డ ప్రాంతాల్లో పవన్ పర్యటన సాగుతుంది. ఎక్కువగా నష్టపోయిన దివిసీమ ప్రాంతంలో పవన్ పర్యటిస్తారు. చల్లపల్లి మండలంలోని పాగోలులో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు భరోసా ఇవ్వనున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు కుటుంబాన్ని పరామర్శిస్తారు. రైతులతో సమావేశం అవుతారు. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటోన్న సమస్యలు, పలు కీలక అంశాలపై చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
కృష్ణా జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన.. గన్నవరం చేరుకున్న జనసేనాని - Janasena Latest news
పవన్‌కల్యాణ్ ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉయ్యూరు, పామర్రు, అవనిగడ్డ ప్రాంతాల్లో పవన్ పర్యటన సాగనుంది. నివర్ తుపాను కారణంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు.
కృష్ణా జిల్లాలో పర్యటించనున్న జనసేనాని పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనలో భాగంగా ఇప్పటికే గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. జనసేనానికి అభిమానులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఇదీ చదవండీ... 350వ రోజు నిరసనలు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
Last Updated : Dec 2, 2020, 10:39 AM IST