ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పవన్​కల్యాణ్ అభిమాని మృతి.. పాడె మోసిన మంత్రి, మాజీ మంత్రి - pawan kalyan fan died with heart attack news

ఎప్పుడూ రాజకీయాల్లో హడావుడిగా ఉండే నేతలు మానవత్వం చాటుకున్నారు. నిత్యం పరస్పర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఓ వ్యక్తి అంతిమయాత్రలో పాల్గొనడమే కాకుండా పాడె మోశారు.

pawan kalyan fan died with heart attack
pawan kalyan fan died with heart attack

By

Published : Feb 3, 2020, 12:29 PM IST

Updated : Feb 3, 2020, 1:55 PM IST

పవన్​కల్యాణ్ అభిమాని మృతి.. పాడె మోసిన మంత్రి, మాజీ మంత్రి

కృష్ణా జిల్లా మచిలీపట్నం పవన్​కల్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు దాసరి లక్ష్మణ రావు(బుడ్డా) గుండెపోటుతో మృతి చెందారు. మచిలీపట్నంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన సుధా ఫొటో స్టూడియో యజమాని సుధాకర్ మరణించారు. ఆయన దాసరి లక్ష్మణరావుకు సన్నిహితుడు. సుధాకర్​ మరణవార్తతో లక్ష్మణరావు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. ఆ బాధలోనే గుండెపోటుకు గురైనట్లు లక్ష్మణరావు కుటుంబసభ్యులు భావిస్తున్నారు. వెంటనే నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. శనివారం అంతిమయాత్ర నిర్వహించగా మంత్రి పేర్ని నానితోపాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని పాడె మోశారు. పలువురు నగర ప్రముఖులు లక్ష్మణరావుకు నివాళులర్పించారు.

ఇదీ చదవండి: నా వల్లే చనిపోయాడు.. నేనూ ఉండలేను!

Last Updated : Feb 3, 2020, 1:55 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details