ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనసైనికులకు పవన్ కల్యాణ్ అభినందనలు.. - కృష్ణా జిల్లా తాజా వార్తలు

తొలిదశ ఎన్నికల ఫలితాల్లో జనసేన నాయకులు తమ సత్తా చాటారని జనసేనాని పవన్ కల్యాణ్ అభినందించారు. ఇదే స్పూర్తిని మిగిలన ఎన్నికల్లోనూ జనసేన సైనికులు విజయం సాధించాలని పవన్ పిలుపు నిచ్చారు.

pawan kalyan
pawan kalyan

By

Published : Feb 13, 2021, 12:08 PM IST

తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన నాయకులూ, శ్రేణులు ఎంతో ప్రభావశీలంగా పని చేశారని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అభినందించారు. ఫలితాలు ఎంతో సంతృప్తినిచ్చాయన్నారు. పార్టీ భావజాలంతో పోటీలో నిలిచి, పార్టీ శ్రేణుల మద్దతు పొందిన వారు 18 శాతానికి పైగా ఓట్లు, గణనీయంగా సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు కైవసం చేసుకొన్నారన్నారు.

వెయ్యికి పైగా వార్డుల్లో గెలిచారని.. తమకు అందిన సమాచారం మేరకు విశ్లేషిస్తే 17 వందలకు పైగా పంచాయతీల్లో రెండో స్థానం దక్కిందన్నారు. ఈ ఫలితాలు చూస్తుంటే మార్పు మొదలైందని అర్థం అవుతోందన్నారు. పంచాయతీ ఎన్నికలు అంటే అధికార పక్షానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని.. అలాంటి పరిస్థితుల్లోనూ జనసేన నాయకులు, కార్యకర్తలు, ఆడపడుచులు ధైర్యంగా నిలబడి పోరాటం చేశారని ప్రశంసించారు. వారందరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన దశల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆశిస్తున్నానని పవన్‌ అన్నారు.

ఇదీ చదవండి:పల్లె పోరు: కొనసాగుతున్న పోలింగ్.. 8.30 గంటలకు ఓటింగ్ శాతం ఎంతంటే..?

ABOUT THE AUTHOR

...view details