రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ కలిసి వినతిపత్రం అందజేశారు. 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు దుర్భర దయనీయ స్థితిలో జీవితాన్ని గడుపుతున్నారని తన వినతిపత్రంలో పవన్ పేర్కొన్నారు. అనేకమంది భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరక్క ఉపాధి కోల్పోయారని.. ఈ విషయంపై తాము అనేక నివేదికలు, సమావేశాల ద్వారా వివరణాత్మకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం తగిన రీతిలో స్పందించలేదన్నారు. ఈ పరిస్థితులలో భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా రాష్ట్రంలో ఇసుక సరఫరాను పునరుద్ధరించాలని.. తద్వారా వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని.. నూతన ఇసుక ప్రణాళికను తక్షణం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ లాంగ్‌మార్చి నిర్వహించిందని చెప్పారు. అయినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన కనిపించడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరారు. రాష్ట్రంలో ఎలాంటి ఇసుక ప్రణాళిక ఉంటే భవన నిర్మాణ కార్మికులకు ఉపయుక్తంగా ఉంటుందో యోచించి తాము ఈ లేఖతో పాటు ఇసుక ప్రణాళికను అందిస్తామని.. పరిశీలించాలని పవన్ కోరారు.
గవర్నర్‌తో జనసేన అధ్యక్షుడు పవన్ భేటీ.. జోక్యం చేసుకోవాలని వినతి - జనసేన అధ్యక్షుడు పవన్ తాజా న్యూస్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, ఇసుక కొరత వంటి అంశాలపై వినతిపత్రం అందజేశారు.
గవర్నర్‌ను కలవనున్న జనసేన అధ్యక్షుడు పవన్
Last Updated : Nov 12, 2019, 3:06 PM IST