కృష్ణా జిల్లా విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సిబ్బందితో కలిసి సీఐ మురళి కృష్ణ సాధారణ తనిఖీలు చేపట్టారు. కుమ్మరిపాలెం కూడలి నుంచి పున్నమి ఘాట్ వరకు కాలినడకన పెట్రోలింగ్ నిర్వహించారు. ఘాట్ సమీపంలో గంజాయి, మద్య సేవిస్తు జులాయిగా తిరుగుతున్న వాళ్లను పట్టుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు.
అనంతరం ప్రధాన రహదారిపై మాస్కులు లేకుండా తిరుగుతున్న ద్విచక్రవాహనదారుకు కొవిడ్ జాగ్రత్తలు వివరించారు. వైరస్ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. నిబంధనలు పాటించకుండా తిరిగితే భారీ జరిమానా విధిస్తామని సీఐ మురళి కృష్ణ హెచ్చరించారు.