ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హృద్రోగి మృతి... కుటుంబీకుల ఆందోళన - వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి

కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన సోమేశ్వరరావు అనే వ్యక్తి మృతి చెందాడు. విజయవాడలోని వైవీ రావు ఆసుపత్రిలో బైపాస్‌ శస్త్ర చికిత్స అనంతరం సోమేశ్వరరావును డిశార్జ్ చేశారు. అయితే భోజనం చేస్తున్న సమయంలో అతను అస్వస్థతకు గురి కాగా కుటుంబసభ్యులు మళ్లీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సకాలంలో స్పందించని కారణంగానే మృతి చెందాడని కుటుంబీకులు ఆసుపత్రి ముందు నిరసన తెలిపారు.

patient died due to doctors negligence in nuzivedu at krishna district
సకాలంలో వైద్యం అందక వ్యక్తి మతి... కుటుంబసభ్యుల ఆందోళన

By

Published : Oct 6, 2020, 3:36 PM IST

కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతానికి చెందిన హృద్రోగి సోమేశ్వరరావు అనే వ్యక్తి 10 రోజుల క్రితం విజయవాడలోని వైవీ రావు ఆసుపత్రిలో బైపాస్‌ శస్త్ర చికిత్స నిమిత్తం చేరారు. 3 రోజుల క్రితం శస్త్ర చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు. భోజనం చేస్తున్న సమయంలో ఇంట్లో స్పృహ తప్పి పడిపోయాడు. కుటుంబసభ్యులు వెంటనే 108లో నూజివీడులో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు విజయవాడ తీసుకువెళ్లాలని సూచించగా మళ్లీ వైవీ రావు ఆసుపత్రికి తీసుకువచ్చారు.

ఈ క్రమంలో సోమేశ్వరరావు మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయారని ఆసుపత్రి ఎదుట బైఠాయించి బంధువులు నిరసన వ్యక్తం చేశారు. వైద్యులు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కృష్ణలంక పోలీసులు ఆసుపత్రి ప్రాంగణంలో బందోబస్తు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details