దేవుడి విగ్రహాలు నకిలీవంటూ... పోస్ట్ చేసిన కాకినాడకు చెందిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. బెంగుళూరు ఘోషిప్స్ యూట్యూబ్ ఛానల్లో తానే ఎన్నో విగ్రహాలను ధ్వంసం చేశానంటూ పోస్టు పెట్టిన అతనిపై సైబర్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. గుంటూరుకు చెందిన లక్ష్మీనారాయణ ఇచ్చిన పిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తులో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు ఉన్నాయని, అన్యమత ప్రచారంపై ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
దేవుడి విగ్రహాలు నకిలీవంటూ పోస్ట్ చేసిన ఓ పాస్టర్ అరెస్ట్ - PASTER PREVEEN LATEST NEWS
కాకినాడకు చెందిన ఓ పాస్టర్ను సీఐడీ పోలీసు అరెస్ట్ చేశారు. దేవుడి విగ్రహాలు నకిలీవంటూ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసినందుకు అతనిపై సైబర్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

దేవుడి విగ్రహాలు నకిలీవంటూ పోస్ట్ చేసిన ఓ పాస్టర్ అరెస్ట్
Last Updated : Jan 19, 2021, 8:31 PM IST