కృష్ణా జిల్లా నందిగామ వద్ద మున్నేరు పెద్ద వంతెన పైనుంచి దూకి పాస్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడు గ్రామానికి చెందిన వేమవరపు దేవసహాయం కొంతకాలంగా నందిగామలో నివాసముంటూ.. పాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మున్నేరు పెద్ద వంతెన పైనుంచి దూకడంతో మరణించాడు. గమనించిన స్థానికులు.. స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్థరించారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు.. ఏఎస్సై బేబీ తెలిపారు.
మున్నేరు పెద్ద వంతెన పైనుంచి దూకి పాస్టర్ ఆత్మహత్య - కృష్ణా జిల్లా తాజా వార్తలు
కృష్ణా జిల్లా నందిగామ వద్ద మున్నేరు పెద్ద వంతెన పైనుంచి దూకి పాస్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరులోని తూళ్లూరుకు చెందిన దేవసహాయం.. నందిగామలో పాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మున్నేరు పెద్ద వంతెన పైనుంచి దూకడంతో మరణించాడు. పాస్టర్ మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేశారు.

మునేరు పెద్ద వంతెన పైనుంచి దూకి పాస్టర్ ఆత్మహత్య