లాక్ డౌన్ తో 50 రోజులుగా వెలవెల బోయిన విజయవాడ రైల్వే స్టేషన్ లో ఎట్టకేలకు ప్రయాణికుల సందడి ప్రారంభమైంది. దిల్లీ నుంచి ప్రత్యేక రైలు రాకతో స్టేషన్ నుంచి ప్రయాణికుల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. లాక్ డౌన్ కారణంగా పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న వారు రాష్ట్రానికి చేరుకోగా.. ఇక్కడ చిక్కుకున్న ఇతర రాష్ట్రాల వారు వారిని స్వస్థలాలకు బయలు దేరి వెళ్లారు. ఎక్కడా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. రాష్ట్రానికి వచ్చిన వారందరికీ కరోనా ప్రాధమిక పరీక్షలు జరిపి క్వారంటైన్‌కు తరలించారు.
ప్రారంభమైన రైళ్ల రాకపోకలు
మార్చి 23న జనతా బంద్ ఆ తర్వాత కొనసాగిన లాక్ డౌన్‌తో బోసి పోయిన విజయవాడ రైల్వే స్టేషన్ లో రాకపోకలు ప్రారంభమయ్యాయి. లాక్ డౌన్ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుని కష్టాలు పడుతోన్న వారిని సొంత ప్రాంతాలకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. నిన్న బయలుదేరిన దిల్లీ నిజాముద్దీన్ -చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ప్రత్యేక రైలు ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు విజయవాడ చేరుకుంది. దిల్లీ సహా ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ , మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో చిక్కుకున్న 318మంది ప్రయాణికులు రాజధాని ప్రాంతం విజయవాడకు చేరుకున్నారు.
ఆగ్రా, ఝాన్సీ, భోపాల్, నాగపూర్, వరంగల్ స్టేషన్లలో స్టాపింగ్
ఆయా రాష్ట్రాల్లోని ఆగ్రా, ఝాన్సీ, భోపాల్, నాగపూర్, వరంగల్ రైల్వే స్టేషన్లలో ఈ రైలుకు స్టాపులు ఏర్పాటు చేయడం సహా ఐఆర్టీసీ ద్వారా రిజర్వేషన్ సదుపాయం కల్పించడంతో వారంతా స్వస్థలాలకు బయలు దేరి వచ్చారు. విజయవాడ రైల్వే స్టేషన్ కు చేరుకున్న ప్రయాణికులకు కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ మాధవీ లత సహా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. వారందరి కోసం ప్రత్యేకంగా నిరీక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి భోజనాన్ని అందించారు.
పరీక్షల తర్వాత ప్రయాణానికి అనుమతి