ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Parvathi Barrage : కాళేశ్వరం ఎత్తిపోతలతో నిండుకుండలా గోదావరి బ్యారేజీలు - Parvathi Barrage : కాళేశ్వరం ఎత్తిపోతలతో నిండుకుండలా గోదావరి బ్యారేజీలు

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పార్వతి బ్యారేజ్​లోని నీటిని ఎత్తిపోస్తున్నారు. ఫలితంగా పలు ప్రాజెక్టులు గోదావరి జలాలతో కనువిందు చేస్తున్నాయి.

Parvathi Barrage : కాళేశ్వరం ఎత్తిపోతలతో నిండుకుండలా గోదావరి బ్యారేజీలు
Parvathi Barrage : కాళేశ్వరం ఎత్తిపోతలతో నిండుకుండలా గోదావరి బ్యారేజీలు

By

Published : Jun 20, 2021, 6:09 PM IST

Parvathi Barrage : కాళేశ్వరం ఎత్తిపోతలతో నిండుకుండలా గోదావరి బ్యారేజీలు

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు వద్ద నిర్మించిన సరస్వతి పంప్​ హౌస్​లో ఏడు మోటార్ల ద్వారా పార్వతి బ్యారేజ్​లోని గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నారు.

14 పైపుల ద్వారా పార్వతి బ్యారేజ్​లోకి గోదారమ్మా !

గత నాలుగు రోజులుగా నీటి ఎత్తిపోతల ప్రక్రియ కొనసాగుతోంది. తొలుత రెండు మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసి.. ప్రవాహం పెరిగే కొద్దీ విడతల వారీగా మూడు, ఐదు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోశారు. తాజాగా ఆదివారం ఏడు మోటార్లను రన్​చేస్తూ.. మొత్తం 14 పైపుల ద్వారా నీటిని పార్వతి బ్యారేజ్​లోకి ఎత్తిపోస్తున్నారు.

గరిష్ఠ నీటి మట్టం 8.83 టీఎంసీలు..

పార్వతి బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 8.83 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.518 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం 20 వేల క్యూసెక్కుల నీటిని పార్వతి బ్యారేజ్​లోకి ఎత్తి పోస్తుండటంతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది.

నిండుకుండలా మధ్యమానేరు..

మధ్యమానేరులోకి గోదావరి జలాలు భారీగా చేరుతున్నాయి. రోజుకు ఒక టీఎంసీ చొప్పున మద్య మానేరు ప్రాజెక్టులోకి తరలిస్తున్నారు. పార్వతి, నంది పంప్​ హౌస్​ల నుంచి ఇన్​ఫ్లో రావడం వల్ల ఆ మేరకు గాయత్రి పంప్​ హౌస్​ నుంచి నాలుగు బాహుబలి పంపులతో 12,600 క్యూసెక్కుల జలాలను ఎత్తిపోస్తున్నారు. మొదట్లో రెండు బాహుబలి పంపులతో ఎత్తిపోతలు చేపట్టారు. క్రమంగా మరో రెండు బాహుబలి పంపులతో నీటిని ఎత్తిపోశారు.

గాయత్రి పంప్​హౌస్ నుంచి 12,600 క్యూసెక్కులు..

మరోవైపు మధ్య మానేరు నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా ఈ జలాశయంలో నీటి నిలువ తగ్గకుండా గాయత్రి పంప్ హౌస్ నుంచి 12,600 క్యూసెక్కుల జలాల ఎత్తిపోతలు చేపడుతున్నారు.

ఇవీ చూడండి : రేపట్నుంచి తెలంగాణకు బస్సులు నడపాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details