ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చంద్రబాబు పేరు చెప్తే వదిలేస్తారా ? సీఐడీ ఇదేం పద్ధతి' - Tdp Polit Bureau latest News

విచారణలో భాగంగా మాజీ మంత్రి దేవినేని ఉమపై సీఐడీ అధికారులు ఒత్తిడి తీసుకురావటం తీవ్ర ఆందోళనకరమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప భగ్గుమన్నారు. కరోనా కల్లోలం కొనసాగుతున్న సందర్భంలో ఇలాంటి విపరీత విపత్కర పోకడలు సమాజానికి మంచిది కాదని ఆయన హితవు పలికారు.

'చంద్రబాబు పేరు చెప్తే వదిలేస్తారా ? సీఐడీ ఇదేం పద్ధతి'
'చంద్రబాబు పేరు చెప్తే వదిలేస్తారా ? సీఐడీ ఇదేం పద్ధతి'

By

Published : Apr 30, 2021, 4:37 PM IST

చంద్రబాబు పేరు చెప్తే వదిలేస్తామంటూ మాజీ మంత్రి దేవినేని ఉమపై సీఐడీ ఒత్తిడి తీసుకురావటం దుర్మార్గమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప తీవ్రంగా ఖండించారు.

సీఐడీ ఇష్టానుసార ప్రవర్తన..

దర్యాప్తు అధికారులు ఇష్టానుసారంగా వాంగ్మూలాలు తయారు చేసి.. వాటిపై తెదేపా నేతల్ని సంతకాలు చేయాలని బెదిరించడం ఏం పద్ధతని చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులతో వైకాపా ప్రభుత్వం ప్రతిపక్ష నేతల గొంతు నొక్కాలనుకుంటోందని తీవ్రంగా మండిపడ్డారు.

కరోనా అల్లకల్లోలం సమయంలోనా..

కరోనా కల్లోలం కొనసాగుతున్న నేపథ్యంలో విచారణ పేరుతో ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టడం సీఎం జగన్ కక్షసాధింపు చర్యలో భాగమేనన్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరిగిన వరుస దాడుల్ని నిరోధించటంలో విఫలమైన మంత్రి వెలంపల్లి.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడం విడ్డురమన్నారు. సొంత నియోజకవర్గంలోని దుర్గగుడి అవినీతి మంత్రికి తెలియకుండానే జరిగిందా అని చినరాజప్ప నిలదీశారు.

ఇవీ చూడండి :4.5 లక్షల రెమ్​డెసివిర్ వయల్స్​ దిగుమతి !

ABOUT THE AUTHOR

...view details