కృష్ణాజిల్లా బంటుమిల్లిలో తెదేపా-వైకాపా వర్గీయులు పరస్పర దాడులు చేసుకున్నారు. చీపుర్లు, కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటనలో తెదేపాకు చెందిన ముగ్గురికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. వైకాపాకు చెందిన చినబాబు దాడి చేశారంటూ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. తెదేపాకు చెందిన కాగిత వెంకట్రావు తమపైనే ముందుగా దాడి చేశారంటూ వైకాపా నేతలు ఆరోపించారు. స్టేషన్ ఎదుట ఇరువర్గాలు నిరసన చేపట్టారు. రెండు పార్టీల దగ్గర నుంచి కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
కృష్ణాజిల్లాలో తెదేపా-వైకాపా వర్గీయుల ఘర్షణ.. పరస్పర దాడులు - కృష్ణాజిల్లాలో పార్టీ గొడవలు
కృష్ణాజిల్లాలో పార్టీ కక్షలు భగ్గుమన్నాయి. బంటుమిల్లిలో తెదేపా-వైకాపా వర్గీయులు పరస్పర దాడులు చేసుకున్నారు.

కృష్ణా జిల్లాలో తెదేపా వైకాపా వర్గీయుల పరస్పర దాడులు
స్టేషన్ ఎదుట దాడి చేసుకుంటున్న తెదేపా, వైకాపా వర్గీయులు