జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు మినహా పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 63 శాతం పోలింగ్ జరిగిందని అధికారులు తెలిపారు. గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గిందనే చెప్పాలి. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్.. క్రమంగా పెరిగింది. కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. కర్రలతో దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. పోలీసులు రంగంలోకి వెంటనే అదుపు చేశారు. గన్నవరంలో తమ పోలింగ్ బూతులు ఎటువైపు ఉన్నాయో తెలియక ఓటర్లు కొద్దిసేపు అయోమయంలో పడ్డారు. ఉదయం నుంచి వృద్ధులు ,యువకులు ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
చెదురుమదురు ఘటనలు మినహా పరిషత్ ఎన్నికలు ప్రశాంతం - krishna latest news
కృష్ణా జిల్లాలో చెదురుమదురు ఘటనలు మినహా పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా 63 శాతం పోలింగ్ నమోదైంది.
మైలవరంలో ఎన్నికలు సజావుగా సాగాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగిన ఈ ఎన్నికలలో ఈ సారి ఓట్లు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. కోర్ట్ తీర్పు తదితర అంశాలపై ఓటర్లు తికమకకి గురవవడంతో, పోలింగ్ శాతం తగ్గడానికి ముఖ్య కారణమని అధికారులు అభిప్రాయపడ్డారు. బ్యాలెట్ బాక్సులని స్థానిక లక్ష్మీ రెడ్డి ఇండోర్ స్టేడియంలో భద్రపరిచారు. గన్నవరం బాయ్స్ హై స్కూల్ ఆవరణలో ఎమ్మెల్యే వంశీ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇదీ చదవండి:కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా పరిషత్ ఎన్నికల పోలింగ్