తల్లిదండ్రుల చదువు ప్రభావం పిల్లలపై..
తల్లిదండ్రుల విద్యాభ్యాసం వారి పిల్లలపైనా ప్రభావం చూపుతోంది. ఐదో తరగతిలోపు చదువుకున్న వారిలో 90% మంది తమ పిల్లల్ని ప్రభుత్వ బడులకు పంపుతున్నట్లు సర్వే వెల్లడించింది. పదో తరగతి వరకు చదువుకున్న వారిలో 70%, పదిపైన చదువుకున్న వారిలో 56.5% మంది ఇలా పంపుతున్నారు. చదువుకున్న కుటుంబాల్లో స్మార్ట్‌ఫోన్ల వినియోగం ఎక్కువగా ఉంది.
1. ఐదో తరగతిలోపు చదువుకున్న తల్లిదండ్రులున్న విద్యార్థులు 26.8% ఉండగా వీరిలో 42.6% మందికి స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి.
2. తల్లిదండ్రుల అర్హత 10వ తరగతి వరకు ఉన్న పిల్లలు 50% ఉండగా.. వీరిలో 65.4% మందికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.