లాక్డౌన్తో పనులు లేక ఇబ్బందులు పడుతున్న వలస కూలీలు కాలినడకన స్వస్థలాలకు పయనమయ్యారు. ఈ క్రమంలో సుదూర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు నడుచుకుంటూ వెళ్తున్న వలసదారులకు పలువురు దాతలు బాసటగా నిలుస్తున్నారు. పెనుగంచిప్రోలు మండల పరిధిలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న పారామౌంట్ పరిశ్రమ అధినేత సురేష్ వేలాది మంది వలస కూలీలకు అన్నదానం చేస్తున్నారు.
వలస కూలీల అన్నదానం చేస్తున్న పారామౌంట్ పరిశ్రమ - penuganchiprolu paramount industry food donation news
లాక్డౌన్ వల్ల అనేక మంది వలస కార్మికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. ఉండటానికి ఇళ్లు, తినడానికి తిండిలేక అల్లాడుతున్నారు. చేసేది లేక సొంతూళ్లకు వెళ్లేందుకు కాలినడకన బయల్దేరుతున్నారు. అలాంటి వారికి కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండల పరిధిలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న పారామౌంట్ పరిశ్రమ అధినేత సురేష్ వేలాది మంది వలస కూలీలకు అన్నదానం చేస్తున్నారు.
వలస కూలీల అన్నదానం చేస్తున్న పారామౌంట్ పరిశ్రమ
భోజనం చేసిన తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకునేందుకు జాతీయ రహదారి పక్కన ప్రత్యేక షామియానా ఏర్పాటుచేశారు. అనంతరం వారిని తమ సొంత వాహనాల్లో కొంత దూరం చేరవేస్తూ వారికి ఉపసమనం కలిగిస్తున్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమబంగా రాష్ట్రాలకు చెందిన కూలీలకు అవసరమైన సూచనలు సలహాలు అందిస్తున్నారు.