మూడేళ్లుగా నిర్వహిస్తున్న కృష్ణానది హారతిని తిరిగి కొనసాగించాలని అర్చకులు డిమాండ్ చేశారు. ఇంద్రకీలాద్రి సమీపంలోని దుర్గా ఘాట్ లో నిరసనకు దిగారు. పవిత్ర హారతిని నిలిపివేసిన కారణంగా.. 35 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. నదులను పూజించడం మన సంప్రదాయమని... ప్రభుత్వం మారగానే నిత్యహారతిని నిలిపివేయటం సమంజసం కాదని అన్నారు. తమ ఉపాధికి భరోసా కల్పించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. గత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పండితులపై చూడపం మంచిదికాదని అభిప్రాయపడ్డారు. దసరా ఉత్సవాలు సమీపిస్తున్నందున ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రస్తుతం చేస్తున్న 35 పండితులతోనే నిత్య హారతిని నిర్వహించాలని డిమాండ్ చేశారు.
పవిత్ర హారతిని పునరుద్ధరించాలంటూ.. అర్చకుల నిరసన - harati
ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణానదికి పవిత్ర హారతిని పునరుద్ధరించాలని అర్చకులు ఇంద్రకీలాద్రి వద్ద దుర్గా ఘాట్లో డిమాండ్ చేశారు.
నిరసన