రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా అని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దిశ చట్టం వల్ల మహిళలకు ఏం ఒరిగిందని ప్రశ్నించారు. నిఘా యాప్ ఏమైందన్నారు. మంత్రాలయం, పుంగనూరు, ఆదోని సహా పలు ప్రాంతాల్లో మహిళలు నామినేషన్లు వేయకుండా పోలీసులే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మహిళలు అభ్యర్థులుగా ఉన్న 166 చోట్ల ఎంపీటీసీలు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపాకు మహిళలపై చిత్తశుద్ధి ఉంటే నామినేషన్లు అడ్డుకున్న చోట రీ నోటిఫికేషన్ ఇప్పించాలని సవాల్ విసిరారు.
'చిత్తశుద్ధి ఉంటే.. ఆ ప్రాంతాల్లో రీ నోటిఫికేషన్ ఇప్పించాలి' - panchumarthi anuradha speech about latest issues in andhrapradesh
స్థానిక సంగ్రామంలో నామినేషన్లు వేయకుండా మహిళలపట్ల వైకాపా నాయకులు ప్రవర్తించిన తీరును తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఖండించారు. మహిళలకు ఇచ్చే రక్షణ ఇదేనా అని ప్రభుత్వాన్ని నిలదిశారు.
!['చిత్తశుద్ధి ఉంటే.. ఆ ప్రాంతాల్లో రీ నోటిఫికేషన్ ఇప్పించాలి' panchumarthi anuradha speech about latest issues in andhrapradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6407719-665-6407719-1584192250945.jpg)
వైకాపా పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పంచుమర్తి అనురాధ