ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇన్​సైడర్​​ ట్రేడింగ్​ జరగలేదంటే రాజీనామా చేస్తారా' - తెదేవా నాయకుల తాజా వార్తలు

రాజధాని అమరావతిలో ఇన్​సైడర్​​ ట్రేడింగ్ జరిగిందని బుగ్గన ఆరోపణను తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ తిప్పికొట్టారు. ఇన్​సైడ్​ ట్రేడింగ్​ విషయంలో తప్పులేదని తేలితే బుగ్గన రాజీనామా చేస్తారా అని సవాల్​ విసిరారు.

Panchumarthi Anuradha press meet in vijayawada
ఇన్​సైడ్​  ట్రేడింగ్​లో తప్పులేదని తేలితే రాజీనామాకు బుగ్గన సిద్ధమా..! : అనురాధ

By

Published : Dec 23, 2019, 6:19 PM IST

Updated : Dec 23, 2019, 9:10 PM IST

'ఇన్​సైడర్​​ ట్రేడింగ్​ జరగలేదంటే రాజీనామా చేస్తారా'

రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్​ ట్రేడింగ్‌ విషయంలో తప్పులేదని తేలితే రాజీనామాకు మీరు సిద్ధమా.. అని ఆర్థికమంత్రి బుగ్గనను తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విజయవాడలోని ద్వారా సవాల్‌ చేశారు. అమరావతి ఒక సామాజిక వర్గానికి చెందిందని వైకాపా నాయకులు విష ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అమరావతి దళిత, బడుగు, బలహీన వర్గాల రాజధాని అని ఆమె అన్నారు. రాజధానికి తూట్లు పెట్టి సినిమా చూపిస్తుంటే కనీసం నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అటువైపు చూడలేదని దుయ్యబట్టారు. ఈలాంటి చర్యలకు వారు కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారని ఆమె అన్నారు. తెలుగుదేశం హయాంలో విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించి కొన్ని ప్రాజెక్టులు తీసుకురావడంలో చంద్రబాబు సఫలీకృతమయ్యారని అనురాధ గుర్తు చేశారు.

Last Updated : Dec 23, 2019, 9:10 PM IST

ABOUT THE AUTHOR

...view details