నూజివీడులో..
కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో.. నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు కొన్ని చోట్ల ఏకగ్రీవాలు అయ్యాయి. నూజివీడు మండలం దేవరగుంట, చాట్రాయి మండలంలోని కోటపాడు, బూరుగుగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఏకగ్రీవమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ మూడు గ్రామాల్లోనూ వైకాపా మద్దతుదారులే ఏకగ్రీవమైనట్లు తెలిపారు.
నియోజకవర్గ పరిధిలో 80 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఆగిరిపల్లి మండలం నుంచి 52 మంది సర్పంచ్ అభ్యర్థులు, 446 మంది వార్డు సభ్యులు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నూజివీడు మండలలో 62 మంది సర్పంచ్ అభ్యర్థులు, 500 మంది వార్డు సభ్యులు ఎన్నికల రేసులో ఉన్నారు. ముసునూరు మండలంలో 42 మంది సర్పంచ్ అభ్యర్ధులు కాగా, 368 మంది వార్డు సభ్యులు పోటీలో ఉన్నారు. చాట్రాయి మండలంలో 40 మంది సర్పంచ్ అభ్యర్థులు కాగా, 317 మంది వార్డు సభ్యులు పోటీలో నిలిచారు.