కేంద్ర జలవనరుల శాఖలోని జలశక్తి అభియాన్ కార్యక్రమం కింద వర్షపు నీటిని ఒడిసిపట్టే పథకానికి రాష్ట్రస్థాయి నోడల్ అధికారిగా పంచాయతీరాజ్ కమిషనర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా స్థాయిలో గ్రామవార్డు సచివాలయాలను పర్యవేక్షించే జాయింట్ కలెక్టర్లను నోడల్ అధికారులుగా నియమిస్తూ ఆదేలిచ్చింది. వర్షం పడినచోటే ఆ నీటిని ఒడిసి పట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకం అమలు కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
జలశక్తి అభియాన్ నోడల్ అధికారిగా పంచాయతీరాజ్ కమిషనర్ - జలశక్తి అభియాన్ కార్యక్రమం తాజా సమాచారం
వర్షపు నీటిని ఒడిసి పట్టడానికి, నీటి సంరక్షణకు ఉద్దేశించిన జలశక్తి అభియాన్ కార్యక్రమానికి నోడల్ అధికారిగా ప్రభుత్వం పంచాయతీ రాజ్ కమిషనర్‌ను నియమిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ నెల 22న ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పింది. జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల్ని నిల్వ చేసేందుకు వీలుగా కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నెల 22 తేదీన ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచారాన్ని ప్రారంభిస్తారని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించింది. ప్రధాని మోదీ ప్రసంగం అనంతరం గ్రామ సభల్లో జల ప్రతిజ్ఞను చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల్ని నిల్వ చేసేందుకు వీలుగా కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:సేంద్రీయ సాగు వైపు రైతులు అడుగులు వేయాలి : నాబార్డు ఛైర్మన్