కృష్ణా జిల్లా పామర్రులో లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ కూరగాయలు పంపిణీ చేశారు. తన సొంత నిధులతో సుమారు 500 మంది పేదలకు సహాయం చేశారు. పెదపారుపూడి మండలం వెంట్రప్రగడలో మానవ హక్కుల సంఘం సభ్యులు వంద కుటుంబాలకు నిత్యావసర సరకులతో పాటు కూరగాయలు పంపిణీ చేశారు.
పేదలకు కూరగాయలు పంపిణీ చేసిన పామర్రు ఎమ్మెల్యే - pamarru mla
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలు, కూలీలు, వలస కార్మికులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థను గమనించిన కొందరు దాతలు ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. తమ వంతు సహాయం చేస్తూ అన్నార్తులకు అండగా నిలుస్తున్నారు.
![పేదలకు కూరగాయలు పంపిణీ చేసిన పామర్రు ఎమ్మెల్యే pamarru MLA, who distributed vegetables to the poor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6772079-739-6772079-1586760432218.jpg)
పేదలకు కూరగాయలు పంపిణీ చేసిన పామర్రు ఎమ్మెల్యే