ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతు భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి' - Pamarru MLA who laid the foundation stone for the development works

కృష్ణా జిల్లా కూచిపూడిలో పలు అభివృద్ధి కార్యక్రమానికి పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్ శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులకు ప్రత్యేక నిధులు కేటాయించి పూర్తి చేస్తామని చెప్పారు.

mla laid foundation stone to development works
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పామర్రు ఎమ్మెల్యే

By

Published : Mar 20, 2021, 7:52 PM IST

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని కూచిపూడి, ఆవిరిపూడి గ్రామాల్లో పామర్రు శాసనసభ్యులు అనిల్ కుమార్... అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కూచిపూడి గ్రామంలో రైతు భరోసా కేంద్రం, వెల్​నెస్ సెంటర్ ఏర్పాట పనులు ప్రారంభించారు.

రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు రైతులకు అందించేందుకు ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి చర్యలు తీసుకున్నారన్నారు. వీటి సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details