ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిల్లలూ.. బొమ్మలు ఇలా వేసేయండి..! - hai bujji painting section for kids

హాయ్! పిల్లలు.. కరోనా సెలవులు కదా.. ఆడుకుందామంటే ఎక్కువమందిని కలవకూడదు. బయటకు కూడా రాకూడదు. ఏం చేయాలో తోచడం లేదు అనుకుంటున్నారా..! అయితే నేనొక ఐడియా ఇవ్వనా. మనందరికీ ఇష్టమైన రంగులతో పెయింటింగ్ వేసేద్దామా. అరే నాకు పెయింటింగ్​ రాదు అనుకోకండి. నేను కొన్ని పెయింటింగ్​ ట్రిక్స్​ చెబుతాను కదా..!

పిల్లలు.. బొమ్మలు ఇలా వేసేయండి..!
పిల్లలు.. బొమ్మలు ఇలా వేసేయండి..!

By

Published : Mar 29, 2020, 6:06 PM IST

మనకు పెయింటింగ్ సరిగా రాకపోయినా.. గొప్ప ఆర్టిస్టు కావొచ్చు. కొన్ని చిన్న చిన్న చిట్కాలు తెలిస్తే చాలు.. అద్భుతమైన చిత్రాలు గీసేయొచ్చు. ఎంచక్కా మనమే చిన్ని పికాసోలు అయిపోవచ్చు. అదెలాగో తెలుసుకుందామా..!

అరచేతులతో అందాల సీతాకోక చిలుక

గీసేద్దాం సీతాకోక చిలుక ఇలా

మనందరికీ సీతాకోక చిలుకంటే ఇష్టం కదా. ఈ చిత్రంలో చూపించినట్లుగా సీతాకోక చిలుక శరీరాన్ని ముందుగా గీసుకోండి. లేకుంటే చార్టుతో కత్తిరించి అతికించుకోవచ్చు. ఆ తర్వాత గ్లౌజులు తొడుక్కుని మీ చేతుల్ని రంగుల్లో ముంచి ఇలా రెక్కల స్థానంలో అచ్చు వేయండి. ఇంకేం మన స్వహస్తాలతో తయారు చేసిన సీతాకోక చిలుక రెడీ.

మొక్కజొన్నతో బొమ్మ

మొక్కజొన్నను దొర్లిస్తే చిత్రం రెడీ

ఓ మొక్కజొన్న తీసుకోండి. దానికి పై చిత్రంలో చూపించినట్లు 4 రకాల ఆయిల్ పెయింట్ రంగులు వేయండి. దీన్ని ఓ తెల్లని చార్టుపై రెండు మూడు సార్లు దొర్లించండి. కాసేపు ఆరనిచ్చి చూడండి.. ఇక అద్భుతమే!

చుక్క చుక్కగా స్ట్రాతో

స్ట్రాతో చెట్టు ఇలా

చార్ట్​పై చెట్టు మొదలు, కొమ్మలు గీసుకోండి. చెట్ల కొమ్మల ప్రాంతంలో అక్కడక్కడ పెయింట్ చల్లండి. తర్వాత స్ట్రాతో నెమ్మదిగా గాలి ఊదండి. ఆ గాలి వేగానికి రంగులు అటూ ఇటూ విస్తరిస్తాయి. అంతే చక్కని చెట్టు బొమ్మ సిద్ధం. కాకపోతే గాలిని బయటకు ఊదాలి. లోపలికి పీల్చకూడదు.

ఈక బొమ్మ చాలా ఈజీ

ఈకను ఇలా గీసేద్దాం

కొన్ని పక్షుల ఈకలు చాలా అందంగా ఉంటాయి కదూ. వాటిని గీయటం గొప్ప గొప్ప ఆర్టిస్టులకే కష్టం. మనం ఓ చిట్కాతో తేలిగ్గా గీసేయవచ్చు. ముందుగా చిత్రంలో చూపించినట్టు కాగితంపై ఓ దారాన్ని పెట్టాలి. ఇది సరిగ్గా మధ్యలో వచ్చేలా రకరకాల రంగుల్ని కొద్ది కొద్దిగా పక్క పక్కనే నిలువుగా వేయాలి. ఇప్పుడు నెమ్మదిగా దారాన్ని తీసేయండి. చిన్న బ్రష్ తీసుకుని నెమ్మదిగా ఈక ఆకారం వచ్చేలా చేయాలి. కాసేపు ఆరనిచ్చి చూడండి.. రంగు రంగుల ఈక తయారైపోతుంది.

పిల్లలూ ఇవన్నీ చేశాక చేతులు కడుక్కోవటం మర్చిపోవద్దే..!

ఇదీ చదవండి:

కరోనా' సెలవుల్లో.. పిల్లలతో ఇలా చేయించండి!

ABOUT THE AUTHOR

...view details