మెట్రో నగరాల్లో మాత్రమే కనిపించే విలాసవంతమైన పేజ్ 3 సెలూన్... నవ్యాంధ్ర రాజధానిలో కొలువుదీరింది. "సెలూన్ టు ది స్టార్స్" అనే ట్యాగ్ లైన్‌తో విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని లబ్బీపేటలో ఏర్పాటు చేశారు. ఈ సెలూన్లో మగువల మనసు దోచే పట్టు చీరలు, ఫ్యాన్సీ లెహంగాస్ కలిగిన కల్పవృక్ష షోరూమ్ సైతం ఉంది. సెలూన్‌ను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గురువారం రాత్రి ప్రారంభించారు. అతిథులుగా చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి, స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తెదేపా నేత గద్దె అనురాధ అతిథులుగా పాల్గొన్నారు. అందుబాటు ధరల్లోనే అధునాతన సేవలు అందించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
విజయవాడ వాసులకు.. అందుబాటులోకి పేజ్ 3 సెలూన్
విలాసవంతమైన సౌకర్యాలు కలిగిన పేజ్ 3 బ్యూటీ సెలూన్.. విజయవాడ వాసులకు అందుబాటులోకి వచ్చింది.
నవ్యంధ్ర వాసులకు సేవలందించనున్న పేజ్ 3 సెలూన్