కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో రోజూ కురుస్తున్న వర్షాలకు యంత్రంతో వేసిన విత్తనాలు ముంపునకు గురయ్యాయి. నారు మడులను కూడా వర్షం ముంచెత్తింది. ఆ నీటిని బకెట్లతో తోడేయడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. మండలంలో సుమారు 900 ఎకరాలు వరి మొక్కలు నీటి ముంపు బారిన పడ్డాయి.
భారీ వర్షానికి నారుమడుల మునక - వర్షం పడి మోపిదేవి మండలంలో మునిగిన నారుమడులు
కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షానికి పల్లపు ప్రాంతాల్లో వరి నారుమళ్లు మునిగి పోయాయి. కొందరు రైతులైతే చేసేదేమీ లేక నాటు పద్ధతిలో వరినాటు వేసుకోవచ్చు అని వదిలేశారు.

నారుమడుల నుంచి నీటిని తోడుతున్న రైతు