కృష్ణా జిల్లాలో ధాన్యం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని వీరులపాడు మండలం వి.అన్నవరం, దొడ్డదేవరపాడు, పల్లంపల్లి, కొణతాలపల్లి, నందలూరు, తాటిగుమ్మి తదితర గ్రామాల్లో.. రైతులు పండించిన వడ్లను ధాన్యం కోనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయడం లేదు.
దళారులకు తక్కువకు రైతులు అమ్ముకోకపోతున్నారు. ఇలా దీన స్థితిలో ఉన్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా కాపాడేందుకు.. చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలన్నారు.