ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైదరాబాద్‌లో 64 దేశాల రాయబారులు, హైకమిషనర్ల పర్యటన - భారత్​ బయోటెక్​కు విదేశీ ప్రతినిధులు వార్తలు

హైదరాబాద్​లోని భారత్ బయోటెక్​ను 64 దేశాల రాయబారులు, హైకమిషనర్లు బయోలాజికల్-ఇ సంస్థను సందర్శించారు. ఈ విదేశీ ప్రతినిధులు రెండు బృందాలుగా టీకాల పురోగతిని తెలుసుకున్నారు.

foreign delegation arriving in Hyderabad
హైదరాబాద్‌లో 64 దేశాల రాయబారులు, హైకమిషనర్ల పర్యటన

By

Published : Dec 9, 2020, 12:20 PM IST

Updated : Dec 9, 2020, 1:34 PM IST

హైదరాబాద్‌లో 64 దేశాల రాయబారులు, హైకమిషనర్ల పర్యటన

హైదరాబాద్‌లో 64 దేశాల రాయబారులు, హైకమిషనర్లు పర్యటిస్తున్నారు. భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్-ఇ సంస్థను బృందం సందర్శించారు. కరోనా టీకాల తయారీపై అధ్యయనానికి విదేశీ ప్రతినిధులు హైదరాబాద్‌ వచ్చారు. దేశంలో కరోనా టీకాల పురోగతిని విదేశీ ప్రతినిధులు తెలుసుకున్నారు. రాయబారుల పర్యటనను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసింది. విదేశీ ప్రతినిధులు రెండు బృందాలుగా టీకాల పురోగతిని తెలుసుకున్నారు. శామీర్‌పేటలోని జీనోమ్‌వ్యాలీని రాయబారుల బృందాలు సందర్శించాయి.

భారత్‌ బయోటెక్‌ను విదేశీ ప్రతినిధులు సందర్శించారు. టీకాల తయారీపై దృశ్యరూపక ప్రదర్శనను విదేశీ ప్రతినిధులు తిలకించారు. సౌకర్యాలను పరిశీలించి శాస్త్రవేత్తలతో భేటీఅయ్యారు. బయోలాజికల్-ఇ సంస్థను మరో బృందం సందర్శించింది. టీకాల తయారీపై దృశ్యరూపక ప్రదర్శనను తిలకించింది.

ఇదీ చూడండి.చీరాలలో తుప్పుపడుతున్న ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం

Last Updated : Dec 9, 2020, 1:34 PM IST

ABOUT THE AUTHOR

...view details