ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కీళ్లమార్పిడి శస్త్రచికిత్సపై ఈనాడు, ఆయుష్​ ఆధ్వర్యంలో అవగాహన - orthopedic awareness campaign in vijayawada

కీళ్లమార్పిడి శస్త్రచికిత్సపై ఈనాడు, ఆయుష్​ ఆసుపత్రి ఆధ్వర్యంలో విజయవాడలో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు పాల్గొని కీళ్ల మార్పిడిపై అవగాహన కల్పించారు. నగరవాసులు అడిగిన ప్రశ్నలకు వైద్యులు సమాధానమిచ్చారు.

కీళ్లమార్పిడి శస్త్రచికిత్స అవగాహన సదస్సు

By

Published : Oct 13, 2019, 11:58 PM IST

కీళ్లమార్పిడి శస్త్రచికిత్సపై ఈనాడు, ఆయుష్​ ఆధ్వర్యంలో అవగాహన

విజయవాడలో ఈనాడు, ఆయుష్​ ఆసుపత్రి వైద్యులు సంయుక్తంగా కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఒకప్పుడు 50 యేళ్లు పైబడిన వారికి మాత్రమే వచ్చే కీళ్ల నొప్పులు ఇప్పుడు 40 యేళ్ల వయసు వారికి సైతం వస్తున్నాయని ప్రముఖ వైద్యులు డా.సుమన్​ పెండ్యాల అన్నారు. మారుతున్న జీవన శైలి విధానమే దీనికి ప్రధాన కారణమని తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం ఫిజియోథెరపీ తప్పనిసరిగా చేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం 30 యేళ్ల కాలపరిమితి గల కృత్రిమ కీళ్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రతిఒక్కరూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఈనాడు యూనిట్​ మేనేజర్​ జీ.ఆర్. చంద్రశేఖర్​ ప్రముఖ వైద్యులు, నగర వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరవాసులు అడిగిన ప్రశ్నలకు వైద్యులు సమాధానామిచ్చారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details