కృష్ణా జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడికి చెందిన రైతు కంభంపాటి సత్యనారాయణ. ప్రకృతి సేద్యం ద్వారా చెరకు పండిస్తూ... బెల్లం తయారుచేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. మొదట్లో రసాయనిక ఎరువులు ఉపయోగించి చెరకు పండించి నష్టాల బారిన పడ్డాడు సత్యనారాయణ. గతేడాది నుంచి సేంద్రీయ పద్ధతిలో పంట పండిస్తూ... బెల్లం తయారుచేసి లాభాలబాట పట్టారు. ఎలాంటి రసాయనాల్లేకుండా తయారుచేసిన బెల్లానికి... మంచి గిరాకీ ఉంది.
ఈ ఏడాది రెండెకరాల్లో చెరకు సాగుచేసి... బెల్లం తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే... విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ వ్యాపారుల నుంచి తనకు ఆర్డర్లు వచ్చాయని సత్యనారాయణ చెబుతున్నాడు. సరైన దిగుబడి లేక... మార్కెట్లో గిట్టుబాటు ధర లభించక... ప్రకృతి సహకరించక... వ్యవసాయం గుదిబండగా మారుతున్న ఈ రోజుల్లో... సేంద్రీయ పద్ధతిలో సాగుచేస్తూ... లాభాల పంట పండిస్తున్నారు సత్యనారాయణ.