ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో చిరుధాన్యాల వంటల పోటీలు - organ millet based food competitions

రుచికరమైన ఆహారం కోసం కుర్రకారంతా ఫాస్ట్​ ఫుడ్​ వైపు పరుగులు తీస్తున్నారు. ఫలితంగా అనారోగ్యానికి గురవుతున్నారు. అలాంటి వాటికి పూర్తి భిన్నంగా ప్రస్తుత తరం వారికి తృణ ధాన్యాలతో రుచికరమైన వంటలతో పాటు ఆరోగ్యకరమైన జీవితం అందించేలా అడుగులు వేస్తున్నారు కొంతమంది మహిళలు. మరీ ఆ రుచికరమైన.. ఆరోగ్యకరమైన వంటలేంటో చుద్దామా..

చిరుధాన్యాల వంటలతో ఆరోగ్యం..

By

Published : Oct 6, 2019, 8:56 PM IST

చిరుధాన్యాల వంటలతో ఆరోగ్యం..

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గో-ఆధారిత వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో చిరుధాన్యాల వంటల పోటీలను నిర్వహించారు. ఆధునిక ప్రమాదకర ఆహారపు అలవాట్లతో ఆరోగ్యాన్ని కోల్పోతున్న ప్రస్తుత తరం వారికి తృణ ధాన్యాలతో రుచికరమైన ఆహారాన్ని ఎలా తయారుచేయవచ్చో తెలిపే విధంగా పోటీలను ఏర్పాటు చేశారు. కొర్ర లడ్డూ.. రాగి బూందీ.. ఊద కట్టే పొంగలి... సామలు కిచిడి... మిలేట్స్ మంచూరియా.. రాగి నూడుల్స్ తదితర వంటలతో మహిళలు తమ ఆరోగ్యకరమైన వంటలను రుచి చూపించారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఫార్ట్యూన్ మురళి కృష్ణ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు చిరుధాన్యాల ఆవశ్యకతను గుర్తించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details