కొవిడ్‌తో తల్లిదండ్రులు మరణిస్తే పిల్లలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
వారికే వర్తిస్తుంది..
18 ఏళ్లలోపు వయసు ఉన్న పిల్లలకే ఈ పరిహారం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. తల్లిదండ్రులు ఇద్దరూ కొవిడ్ సోకి మరణిస్తేనే సాయం అందుతుందని స్పష్టం చేసింది. దారిద్రరేఖకు దిగువగా ఉన్న పేద కుటుంబాలకే సాయం పొందేందుకు అర్హులని వెల్లడించింది. అర్హుల ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీలో ఛైర్మన్‌గా జిల్లా కలెక్టర్, సభ్యుడిగా డీఎంహెచ్ఓ, మెంబర్ కన్వీనర్‌గా శిశు సంక్షేమ శాఖ పీడీ ఉంటారని వివరించింది.