రాష్ట్రంలో దళితులు, మహిళలపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేసేందుకు... ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు త్వరలో ముఖ్యమంత్రి వద్దకు ఓ ప్రతినిధుల బృందం వెళ్లి చర్చించాలని తీర్మానించాయి. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులను అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జస్టిస్ రామకృష్ణ హాజరయ్యారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, వినయకుమార్, ఇతర ప్రజా సంఘాలు నేతలు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.