ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుడివాడలో ఆపరేషన్​ ముస్కాన్​..28మంది బాలకార్మికుల గుర్తింపు - krishna district latest news

ఆపరేషన్ ముస్కాన్​లో భాగంగా... కృష్ణాజిల్లాలోని గుడివాడ పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇరవై ఎనిమిది మంది బాలకార్మికులను గుర్తించారు.

opreation muskhan
పోలీసులు రక్షించిన బాలకార్మికులు

By

Published : Nov 3, 2020, 9:14 AM IST

కృష్ణాజిల్లాలోని గుడివాడ పట్టణంలో ఆపరేషన్ ముస్కాన్ తనిఖీలు జరిగాయి. బాలకార్మికులుగా పనిచేసే 28మందిని పోలీసులు గుర్తించారు. బడిఈడు పిల్లలతో పనులు చేయించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సత్యానందం హెచ్చరించారు. దాడుల్లో గుర్తించిన పిల్లలకు వన్​టౌన్​ పోలీస్​స్టేషన్​ ఆవరణలో కౌన్సిలింగ్ నిర్వహించారు.

ఆపరేషన్ ముస్కాన్ దాడుల్లో గుర్తించిన బాలకార్మికుల తల్లిదండ్రులకు కూడా సీడబ్ల్యూసీ ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తామని డీఎస్పీ అన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలను సెంటర్ హోమ్​కు తరలించి విద్యాబుద్ధులు నేర్పిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 12,621 మంది బాలబాలికలను రక్షించినట్లు చెప్పారు. వారందరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details