నందిగామలో ఆపరేషన్ ముస్కాన్ - Operation Muskan at nandigama
నందిగామలో పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహించారు.పదిమంది బాలకార్మికులను పోలీసులు గుర్తించారు.

నందిగామలో పోలీసులు ఆపరేషన్ ముస్కాన్
కృష్ణా జిల్లా నందిగామలో పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పదిమంది బాలకార్మికులను పోలీసులు గుర్తించారు. నందిగామ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు పట్టణంలోని హోటళ్లు, దుకాణాల్లో తనిఖీ చేశారు. 14 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలు పనులు చేస్తుండగా...గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. వారికి ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. దుకాణ యజమానులకు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.