డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా మైలవరం మండల పరిధిలో 28 మంది బాల కార్మికులను గుర్తించి వారికి విముక్తి కల్పిస్తున్నామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పిల్లలు వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వారికి విద్యాభివృద్ధికి చేయూత అందిస్తామని అన్నారు. చట్ట విరుద్ధంగా పిల్లలను పనిలోకి తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రోహిణి దేవి, ఎంపీడీఓ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
మైలవరంలో ఆపరేషన్ ముస్కాన్..28 మంది బాలలకు విముక్తి - మైలవరంలో ఆపరేషన్ ముస్కాన్
కృష్ణా జిల్లా మైలవరం మండల పరిధిలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు 28 మంది బాల కార్మికులకు గుర్తించి వారికి విముక్తి కల్పిస్తున్నామని...డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
మైలవరంలో ఆపరేషన్ ముస్కాన్