ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లాలో 119 మంది బాలకార్మికులను పోలీసులు గుర్తించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి హోటళ్లు, కర్మాగారాలు వివిధ ప్రదేశాల్లో పనిచేసే బాలలను గుర్తించి వారిని రక్షించారు.
జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి బాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. గుడివాడలో 28, బందరు, నూజివీజడులో 27, నందిగామలో 22, అవనిగడ్డలో 15 మందిని కాపాడారు.