బాల కార్మికులకు మెరుగైన జీవితాన్ని అందించాలనే లక్ష్యంతో పోలీస్ శాఖ ఆపరేషన్ ముస్కాన్ చేపట్టిందని కృష్ణా జిల్లా అవనిగడ్డ డీఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు. అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని ఆరు పోలీస్ స్టేషన్లనుంచి 15 మంది వీధి బాలలను గుర్తించి...వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. వీధి బాలలను గుర్తించడం వారం రోజుల పాటు జరిగే ప్రక్రియ అని తెలిపారు. గుర్తించిన బాలలకు స్వచ్చంద సంస్థల సహకారంతో పౌష్టికాహారం, వ్యాధి నిరోధక శక్తిని పెంచే మందులు అందిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. అవనిగడ్డ సీఐ బి. భీమేశ్వర రవికుమార్, చల్లపల్లి సీఐ.వెంకట నారాయణ, ఎస్సైలు సందీప్, సురేష్, పి.రమేష్ పాల్గొన్నారు.
బాల కార్మికులకు మెరుగైన జీవితం కోసం ఆపరేషన్ ముస్కాన్ - Operation Muskan for a better life for child laborers
బాల కార్మికులకు మెరుగైన జీవితాన్ని అందించాలనే లక్ష్యంతో పోలీస్ శాఖ 'ఆపరేషన్ ముస్కాన్' చేపట్టిందని కృష్ణా జిల్లా అవనిగడ్డ డీఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు.
బాల కార్మికులకు మెరుగైన జివితం కోసం ఆపరేషన్ ముస్కాన్