ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆపరేషన్ ముస్కాన్... నందిగామలో నలుగురు బాలకార్మికులకు విముక్తి - latest news on krishna district

ఆపరేషన్​ ముస్కాన్​ కార్యక్రమంలో భాగంగా నందిగామలో నలుగురు బాలకార్మికులను పోలీసులు గుర్తించారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.

operation muskan
ఆపరేషన్ ముస్కాన్... నందిగామలో నలుగురు బాలకార్మికులకు విముక్తి

By

Published : Jul 14, 2020, 5:22 PM IST

కృష్ణా జిల్లా నందిగామలో ఆపరేషన్ ముస్కాన్ కొవిడ్-19 కార్యక్రమాన్ని పోలీసులు అమలు చేస్తున్నారు. పట్టణంలోని చిరు వర్తక వ్యాపార సంస్థలు, సముదాయాలు, దుకాణాల్లో పనిచేసే బాలకార్మికులను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదువుకునే వయసులో బాల కార్మికులుగా మారటం మంచిది కాదని... తల్లిదండ్రులు ఈ విషయం గమనించి పిల్లలకు మంచి చదువుతో పాటు బంగారు భవిష్యత్తు అందించాలని తెలిపారు.

పిల్లల తల్లిదండ్రులకూ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీ వరకు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తామని... పట్టుకున్న బాలకార్మికులకు మాస్కులు, శానిటైజర్ అందించి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని సీఐ చెప్పారు. క్షేమంగా ఉన్న వారిని తల్లిదండ్రులకు అప్పగిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details