ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవంతంగా పూర్తయిన ఆపరేషన్ ముస్కాన్ - ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ముగిసింది

'మా తల్లిదండ్రులు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు... అందుకే భిక్షాటనకు వెళ్తున్నాను...!' 'మా నాన్న చనిపోయాక హోటల్‌లో పనికి వెళ్తున్నా... రోజుకు 150 ఇస్తున్నారు...!' ఇవేవో ఆర్ట్ సినిమా డైలాగులు కాదు. ఆపరేషన్‌ ముస్కాన్‌లో పోలీసులు రక్షించిన చిన్నారుల మాట. పేదరికం వల్లే బాలకార్మికులు పుట్టుకొస్తున్నారని.... దీని నిరోధానికి అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని డీజీపీ గౌతం సవాంగ్‌ అన్నారు.

operation muskan complited
విజయవంతంగా పూర్తయిన ఆపరేషన్ ముస్కాన్

By

Published : Nov 5, 2020, 9:23 AM IST

పుస్తకాలు పట్టుకుని బడికెళ్లాల్సిన వయసులో... అయితే భిక్షాటన... లేదా బాలకార్మికులగా పని. ఇన్నాళ్లూ వారి జీవనం ఇదే. పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా జరిపిన ఆపరేషన్‌ ముస్కాన్‌లో.... అనేక మంది బాలబాలికల విషాదగాధలు బయటకొచ్చాయి. వారంపాటు చేపట్టిన ఆపరేషన్‌లో... పోలీసులు, ఐసీడీఎస్​ అధికారులు 16వేల 457 మంది చిన్నారులను రక్షించారు. ఆ చిన్నారులందరితో హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్‌ వెబినార్ నిర్వహించారు. సరిగ్గా చదివిస్తే.... ఇష్టమైన రంగాల్లో రాణిస్తామని ఆ చిన్నారులు తెలిపారు.

విజయవంతంగా పూర్తయిన ఆపరేషన్ ముస్కాన్

ఇలాంటి చిన్నారుల సాయానికి ప్రతి జిల్లాకు పది లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్టు శిశు, మహిళా సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. ఆపరేషన్‌లో పనిచేసిన అధికారుల పనితీరును DGP గౌతం సవాంగ్‌ అభినందించారు.

ఏం చేయాలన్నది ఆలోచించాలి..

16,457 మంది పిల్లలను రక్షించడమంటే రాష్ట్రంలో కానీ దేశంలోనూ మునుపెన్నడూ జరగలేదు. వారిని రక్షించడం, జవాబుదారీగా వ్యవహరించడం, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడంతోనే సరిపోదు. తదుపరి ఏం చేయాలన్న అంశం గురించి మనం ఆలోచించాలి.

- గౌతం సవాంగ్‌, డీజీపీ

ప్రతి జిల్లాకు 10 లక్షల రూపాయలు...

ఇటువంటి చిన్నారులకు సాయం చేసేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లాకు 10 లక్షల రూపాయలను కేటాయిస్తుందని శిశు ,మహిళా సంక్షేమ శాఖ డైరక్టర్ కృత్తికాశుక్లా తెలిపారు . కింది స్థాయి సిబ్బంది నుంచి అందరికీ ముందుగా జువైనల్ జిస్టిస్ యాక్ట్ పై శిక్షణ ఇవ్వాలని ఆమె అన్నారు . ఒకసారి రక్షించబడిన చిన్నారులు కొంత కాలం తర్వాత మళ్లీ పనికి వెళుతున్నారని ..దీనిపై డేటా తయారు చేయాలన్నారు.



ఇదీ చదవండీ...

భరతమాత సేవలోనే కొనసాగుతున్న విశ్రాంత జవాన్లు

ABOUT THE AUTHOR

...view details